బన్నీ తమిళ సినిమా హీరోయిన్ ఎవరంటే..? | keerthy suresh to act in Al;lu arjun tamil debut movie | Sakshi
Sakshi News home page

బన్నీ తమిళ సినిమా హీరోయిన్ ఎవరంటే..?

Sep 24 2016 3:21 PM | Updated on Sep 4 2017 2:48 PM

బన్నీ తమిళ సినిమా హీరోయిన్ ఎవరంటే..?

బన్నీ తమిళ సినిమా హీరోయిన్ ఎవరంటే..?

సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో మల్లూ అర్జున్గా స్టార్ ఇమేజ్ సొంతం...

సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో మల్లూ అర్జున్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ ప్రస్తుతం కోలీవుడ్ మీద కన్నేశాడు. అందుకు తగ్గట్టుగా ఓ స్ట్రయిట్ తమిళ సినిమాతో అరవ ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేశాడు.

ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే తమిళ సినిమాను పలువురు తమిళ సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట.

నేను శైలజ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయం సాధించిన కీర్తి ప్రస్తుతం తమిళ నాట స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రెండు భాషల్లో పరిచయం ఉన్న భామ కావటంతో కీర్తి అయితేనే హీరోయిన్గా కరెక్ట్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న బన్నీ, ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తమిళ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement