జయలలిత బయోపిక్‌పై కీర్తి క్లారిటీ | Keerthy Suresh Denies Acting In Jayalalithaa Biopic | Sakshi
Sakshi News home page

May 16 2018 12:53 PM | Updated on May 16 2018 12:53 PM

Keerthy Suresh Denies Acting In Jayalalithaa Biopic - Sakshi

మహానటి సినిమాతో ఘనవిజయం అందుకున్న కీర్తి సురేష్‌ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరు సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌లో కీర్తి సురేష్‌ను తీసుకున్నారన్న ప్రచారం జరిగింది.

మహానటి సక్సెస్‌ తరువాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కీర్తి సురేష్‌ నటించనుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఈ విషయంపై కీర్తి సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. జయలలిత బయోపిక్‌కు సంబంధించి ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement