రొమాన్స్-కామెడీ-సెక్స్‌... పిచ్చి వర్మ | Keeravani Special Thanks to RGV for GST | Sakshi
Sakshi News home page

Jan 29 2018 10:57 AM | Updated on Jan 29 2018 1:18 PM

Keeravani Special Thanks to RGV for GST - Sakshi

సాక్షి, సినిమా : విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్‌ చేశారు. 

కాగా, కీరవాణి కంటే ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్మ ఓ ట్వీట్‌ చేశాడు. వివాదాలు చుట్టు ముట్టినా.. మియా మల్కోవా స్వగతం వీడియో ఆన్‌లైన్‌లో విడుదలై ట్రెండ్‌ సెట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement