పాలసీసాలోనూ మందే

Kartikeya New Movie Title And Poster On 9th September - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో ఫేమస్‌ అయిన హీరో కార్తికేయ. ఈ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ హీరోకు యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అయితే హిప్పీతో పలకరించి నిరాశచెందాడు. ఈ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కార్తీకేయ తన స్వంత బ్యానర్‌లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్దమయ్యాడు.

ప్రేమతో మీ కార్తీక్‌ అంటూ మొదటి చిత్రాన్ని నటించి నిర్మించినా.. అంతగా పేరు తీసుకురాలేదు. అయితే తాజాగా తన సొంత బ్యానర్‌లో రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. జీవితం పాలసీసాతో మొదలై.. మందుసీసాతో ముగిసిపోతుందా? అని అనిపించేట్టు డిజైన్‌ చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top