బైక్‌పై చక్కర్లు కొడుతున్న సారా, కార్తీక్‌!

Kartik Aaryan Shares Bike Ride With Sara Ali Khan  - Sakshi

బాలీవుడ్‌ భామ సారా అలీ ఖాన్‌, యువ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌లు ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’తో తొలిసారిగా జతకట్టారు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటీ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమయాణం సాగుతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలో వాటిని సారా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సారా, కార్తీక్‌లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా కార్తిక్‌, సారాతో కలిసి బైక్‌ వెళుతున్న బుమరాంగ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ఛలాన్‌ కడతావా.. అయితే నాది కూడా’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేస్తూ సారాను సరదాగా ఆటపట్టించాడు. కార్తిక్‌ పోస్టుకు సారా స్పందిస్తూ.. కోపంగా ఉన్న ఎమోజీని కామెంటు చేసింది. ఇక  కార్తిక్‌ వెంటనే ‘జోక్‌ చేశాను అంతే.. పడుకో..’ అంటూ సారాను సముదాయించాడు. ఇలా సారాను సందర్భం చిక్కినప్పుడల్లా కార్తీక్‌ సోషల్‌ మీడియాలో ఆటపట్టిస్తూనే ఉంటాడు. (చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో)

Challan Katega Aur mera bhi ....

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

ఇటీవల సారాకు స్వయంగా తన చేతితో తినిపిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘చాలా బక్కచిక్కిపోయావు.. నువ్వు మళ్లీ ముందులా మారిపోవాలి’ అంటూ కార్తీక్‌ ఆర్యన్‌ ఆటపట్టించాడు. ఇక సారా లావుగా ఉన్నప్పుటీ ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. సారా తన సినిమా కేరిర్‌ కోసం 96 కిలోగ్రాముల బరువు ఉన్న సారా నాజుగ్గా తయారయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమా ప్రమోషన్‌లోని ఓ కార్యక్రమంలో కార్తీక్‌, సారాను స్టేజీపైకి ఎత్తుకొని తీసుకెళ్లిన ఫొటోలు, ఓ స్వీమ్మింగ్‌ ఫూల్‌ దగ్గర సారా దిగుతానంటే  కార్తీక్‌ వద్దంటూ ఆపుతూ... ప్రేమికుల్లా ప్రవర్తించిన తీరును చూసి ఓవరాక‌్షన్‌ చేస్తున్నారంటూ  నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ఇక వాలంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

‘ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top