బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో... | Karthik Subbaraj to direct Siddharth | Sakshi
Sakshi News home page

బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో...

Nov 15 2014 1:11 AM | Updated on Sep 2 2017 4:28 PM

బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో...

బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో...

మొదట్లో తెలుగులో బిజీ బిజీగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం తమిళ చిత్రాలకే పచ్చజెండా ఊపుతున్నారు.

మొదట్లో తెలుగులో బిజీ బిజీగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం తమిళ చిత్రాలకే పచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఈ ఏడాది ఆయన చేసిన ‘జిగర్‌తండా’ ఘనవిజయం సాధించింది. మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా ఓ లఘు చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘పిజ్జా’, ‘జిగర్ తండా’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సిద్ధు నటించిన ‘జిగర్‌తండా’కి ఈయనే దర్శకుడు.

స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన కార్తీక్‌కి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే గతంలో పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవే ఆయన్ను సినిమా దర్శకుణ్ణి చేశాయి. అందుకే ఇప్పుడు లఘు చిత్రాలు తీసి, థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement