ఎన్ని ఏళు నాళ్ అంటున్న కార్తీ | karthi in linguswamy direction | Sakshi
Sakshi News home page

ఎన్ని ఏళు నాళ్ అంటున్న కార్తీ

Apr 19 2014 12:01 AM | Updated on Sep 2 2017 6:12 AM

ఎన్ని ఏళు నాళ్ అంటున్న కార్తీ

ఎన్ని ఏళు నాళ్ అంటున్న కార్తీ

ఎన్ని ఏళు నాళ్‌కు సిద్ధం అవుతున్నారు నటుడు కార్తీ. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శక నిర్మాత లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్ని ఏళు నాళ్‌కు సిద్ధం అవుతున్నారు నటుడు కార్తీ. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శక నిర్మాత లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు సూపర్ హిట్ చిత్రం పైయ్యా వచ్చిన విషయం తెలిసిందే. అందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. అలాంటిది మళ్లీ కార్తీ, లింగుస్వామి కాంబినేషన్‌లో చిత్రమంటే భారీ అంచనాలు నెలకొం టాయి.
 
ఆ అంచనాలను కచ్చితంగా అధిగమిస్తామంటున్నారు దర్శకుడు లింగుస్వామి. ప్రస్తుతం ఈయ న సూర్య, సమంత జంటగా అంజాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగం గా జరుపుకుంటోంది. తదుపరి కార్తీ హీరోగా నటించే చిత్ర షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు లింగుస్వామి తెలిపారు. ఈ చిత్రవిషయాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. కార్తీ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement