
35 ఏళ్ల వయసులోనూ.. హీరోయినే!
కరీనా కపూర్ ఖాన్ 35వ పుట్టిన రోజ వేడుకలు కుటుంబ సభ్యులు, సన్నిహితులలో కలిసి జరుపుకున్నారు.
ఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన 35వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, సన్నిహితులలో కలిసి జరుపుకున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఢిల్లీలోని పటౌడీ ప్యాలెస్లో పార్టీ మూడ్లో హుషారుగా గడిపారు. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమై సోమవారం తెల్లవారుజాము వరకు అతిథులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కరీనా అక్క కరిష్మా కపూర్, స్నేహితులు అమృతా అరోరా, మలైకా అరోరా, ఇంకా మరికొందరు స్నేహితులతో కలిసి చిందులేశారు. కేక్ కట్ చేసి కరీనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి సంబందించిన ఫొటోలను మలైకా అరోరా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కథానాయికల కెరీర్ ఏడెనిమిదేళ్లకు మించి సాగదనే అభిప్రాయన్ని కరీనా కపూర్ వంటి తారలు అబద్ధం చేస్తున్నారు. ఈ బ్యూటీ కథానాయిక అయ్యి దాదాపు పదిహేనేళ్లయ్యింది. సోమవారంతో 35 ఏళ్లు నిండిన కరీనా.. కుర్ర తారలకు ఇంకా మంచి పోటీనే ఇస్తోంది. ఇటీవలే సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ 'బజరంగీ భాయ్ జాన్'లో తన నటనతో మరోసారి తన సత్తా ఏంటో చాటింది. ప్రస్తుతం అర్జున్ కపూర్తో కలిసి 'కీ అండ్ కా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కరీనా ఆఫీస్లో ఉద్యోగం చేసే భార్యగా నటిస్తుండగా, అర్జున్ ఇంట్లోనే ఉండే భర్త క్యారెక్టర్లో నటిస్తున్నారు.
Happy birthday Kareena! # birthdaycelebrations @amuarora @mallikabhat #malaika #karismakapoor pic.twitter.com/irYIzoiaZ6
— Malaika Arora KhanFC (@MallaAroraFC) September 20, 2015