ఆ హీరోయిన్కు స్పెషల్ ట్రీట్మెంట్ | Kareena Kapoor Khan to get special treatment on sets for being preggers | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్కు స్పెషల్ ట్రీట్మెంట్

Jul 19 2016 6:15 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఆ హీరోయిన్కు స్పెషల్ ట్రీట్మెంట్

ఆ హీరోయిన్కు స్పెషల్ ట్రీట్మెంట్

ప్రెగ్నెన్సీతో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సెట్స్పై స్పెషల్ ట్రీట్మెంట్ పొందనుంది.

ప్రెగ్నెన్సీతో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సెట్స్పై స్పెషల్ ట్రీట్మెంట్ పొందనుంది. షూటింగ్ సందర్భంగా ఆమెకు ఎలాంటి ఒత్తిడి, శ్రమ కలగకుండా, మధ్యలో రిలాక్స్ అయ్యేలా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు.

సోనమ్ కపూర్తో కలసి ఓ సినిమాలో నటిస్తున్న కరీనా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి, మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని భావిస్తోంది. ఆమె ప్రస్తుతం హరియాణాలోని పటౌడీ ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత రియా కపూర్, దర్శకుడు శశంకా ఘోష్ అక్కడకు వెళ్లి కరీనాతో షూటింగ్ షెడ్యూల్, డేట్స్ గురించి మాట్లాడినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సినిమా షూటింగ్కు కరీనా డేట్స్ ఇచ్చినట్టు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో బ్యాంకాక్లో, ఆ తర్వాత ఢిల్లీలో షూటింగ్ జరపనున్నారు. కరీనా అభిప్రాయం తీసుకుని దర్శక, నిర్మాతలు షూటింగ్ లోకేషన్స్ ఎంపిక చేశారు. ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ‍్రత్తలు తీసుకున్నారు. షూటింగ్ మధ్యలో రిలాక్స్ కావడానికి ఏర్పాట్లు చేయనున్నారు.  

సైఫ్, కరీనాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన భార్య గర్భవతి అని, డిసెంబరులో తొలి సంతానాన్ని పొందుతామంటూ ఇటీవల సైఫ్ ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement