'ప్రస్తుతం కరీనాకు పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదు' | Kareena does not want to have babies now: Randhir Kapoor | Sakshi
Sakshi News home page

'ప్రస్తుతం కరీనాకు పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదు'

Oct 14 2014 4:57 PM | Updated on Sep 2 2017 2:50 PM

'ప్రస్తుతం కరీనాకు పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదు'

'ప్రస్తుతం కరీనాకు పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదు'

బాలీవుడ్ తార కరీనాకపూర్ ఇప్పుడే పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదని ఆమె తండ్రి అలనాటి బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ అన్నారు.

ముంబై: బాలీవుడ్ తార కరీనాకపూర్ ఇప్పుడే పిల్లల్నికనాలనే ఉద్దేశం లేదని ఆమె తండ్రి, అలనాటి బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ అన్నారు.  ప్రస్తుతం 'సూపర్ నానీ' అనే చిత్రంలో  రేఖతో కలిసి నటిస్తున్న రణధీర్ కపూర్ తాత పాత్రను పోషిస్తున్నారు. కరిష్మాకు ఇద్దరు పిల్లలున్నారని, తన మనవళ్లు అంటే తనకు చెప్పలేనంత అభిమానమని, అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి... కొంతసేపు వారితో గడుపుతానని ఆయన అన్నారు. 
 
కరీనాకు సంతానం కలిగితే బాగుంటదని భావిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు .. ఇప్పడే పిల్లల్ని కనాలని లేదని ఆమె తనతో చెప్పిందని రణధీర్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో తాను ఎక్కువ మాట్లాడలేనని.. ప్రస్తుత జనరేషన్ వారికి మనం సలహాలు ఇవ్వలేమని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement