కవలలతో ఇంటికి స్టార్‌ డైరెక్టర్‌ | Karan johar takes his twins, Roohi and Yash, home | Sakshi
Sakshi News home page

కవలలతో ఇంటికి స్టార్‌ డైరెక్టర్‌

Mar 29 2017 7:28 PM | Updated on Sep 5 2017 7:25 AM

కవలలతో ఇంటికి స్టార్‌ డైరెక్టర్‌

కవలలతో ఇంటికి స్టార్‌ డైరెక్టర్‌

ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయిన బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ బుధవారం తమ చిన్నారులను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకు వెళ్లాడు.

ముంబయి: ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయిన బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ బుధవారం తమ చిన్నారులను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకు వెళ్లాడు. కూతురు రూహి, కొడుకు యాష్‌లను కరణ్‌ ఇంటికి తీసుకువెళుతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. కరణ్‌ చిన్నారిని ఎత్తుకుని సూర్యా ఆస్పత్రి లోపల నుంచి కారు వద్దకు వెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే చిన్నారుల  మొహాలు మాత్రం కెమెరాకు చిక్కలేదు.

నెలలు నిండకుండానే పుట్టడంతో కవలలను ఏడు వారాల పాటు ఎన్‌ఐసీయూలో ఉంచారు.  ఆస్పత్రి డైరెక్టర్‌ భూపేంద్ర అవస్థి ఆ చిన్నారులిద్దరి ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.  కాగా రూహి, యాష్‌లను ఫిబ్రవరి 7న ఆస్పత్రిలో చేర్పించారని, వారిని ఆస్పత్రిలో చేర్చించి 50 రోజులు పూర్తయిందని, కవలల ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి ఇంటికి తీసుకు వెళుతున్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కవలలు పుట్టినప్పటికీ ఆ విషయాన్ని కరణ్‌ ఈ నెల 5న ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన  ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమైనట్లు అతడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement