నేను ఫ్లాప్‌ యాక్టర్‌

Karan Johar admits to being a flop actor - Sakshi

కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బాస్టర్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘కభీ   ఖుషీ కభీ ఘమ్‌’ వంటి చిత్రాలు ఓ ఉదాహరణ. డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన కరణ్‌ ‘నేను ఫ్లాప్‌ యాక్టర్‌’ అంటున్నారు. పూర్తి స్థాయి యాక్టర్‌గా కరణ్‌ చేసిన ‘బాంబే వెల్వెట్, వెల్కమ్‌ న్యూయార్క్‌’ బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. ‘‘నేనో ఫ్లాప్‌ యాక్టర్‌ని. నటుడిగా చేసిన ఏ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదు. సక్సెస్‌ఫుల్‌ సినిమాలు లేకపోవడంతో ఎవ్వరూ నన్ను యాక్టర్‌గా తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే ఆ సినిమాల్లో నా నటన కూడా అంత చెప్పుకోదగ్గ రేంజ్‌లో లేదు’’ అని నిజాయితీగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top