పాలీవుడ్‌కి శక్తి కపూర్! | Kapoor in palivud | Sakshi
Sakshi News home page

పాలీవుడ్‌కి శక్తి కపూర్!

Apr 12 2014 12:10 AM | Updated on Sep 2 2017 5:54 AM

పాలీవుడ్‌కి శక్తి కపూర్!

పాలీవుడ్‌కి శక్తి కపూర్!

హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి ప్రతినాయకుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు... శక్తి కపూర్. ఆయనలో ఎంత గొప్ప విలన్ ఉన్నాడో, అంతే గొప్ప కమెడియన్ కూడా ఉన్నాడు.

 హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి ప్రతినాయకుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు... శక్తి కపూర్. ఆయనలో ఎంత గొప్ప విలన్ ఉన్నాడో, అంతే గొప్ప కమెడియన్ కూడా ఉన్నాడు.

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఉత్తర, దక్షిణాది భాషల్లో వందలాది సినిమాలకు పైగా చేశారు శక్తి. ఈ ఏడాది పాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. పాలీవుడ్  అంటే.. పంజాబీ పరిశ్రమ. జస్వీందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ‘మేరేజ్ డా గారేజ్’ అనే చిత్రంలో శక్తి కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు.
 
జైలు నుంచి విడుదలయ్యే ఇద్దరు ఖైదీలు ‘మేరేజ్ డా గారేజ్’ అనే వ్యాపారం ప్రారంభిస్తారని, ఓ ప్రేమజంట పెళ్లికి వీళ్లెలా సహాయపడతారనేది ప్రధాన ఇతివృత్తం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో చాలా పాత్రలు ఉంటాయని, అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని,  శక్తికపూర్ పాత్ర కామెడీ టచ్‌తో సాగుతుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement