కమెడియన్‌ కూతురు ఫొటో వైరల్‌ | Kapil Sharma Shared Daughter Anayra First Pic | Sakshi
Sakshi News home page

కూతురి ఫొటో షేర్‌ చేసిన స్టార్‌ కమెడియన్‌

Jan 15 2020 5:46 PM | Updated on Jan 15 2020 5:48 PM

Kapil Sharma Shared Daughter Anayra First Pic - Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ తొలిసారిగా తన కూతురి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కూతురిని ఆత్మీయంగా చూస్తున్న ఫొటోకు... ‘ మా హృదయం అనైరా శర్మ’ అనే క్యాప్షన్‌ జతచేసి తన పేరును వెల్లడించాడు. ఈ క్రమంలో అనైరా ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. గంట సేపట్లోనే ఐదున్నర లక్షలకు పైగా లైకులు సాధించి దూసుకుపోతోంది. 

కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ఫేమస్‌ అయిన కపిల్‌ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను కపిల్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు గత నెలలో కుమార్తె జన్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement