బాలీవుడ్‌కి బన్నీ? | kapil dev biopic in allu arjun | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కి బన్నీ?

Sep 8 2018 12:54 AM | Updated on Sep 8 2018 12:54 AM

kapil dev biopic in allu arjun - Sakshi

అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ నటించనున్న చిత్రంపై ఎటువంటి క్లారిటీ లేదు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని టాక్‌. ఇప్పుడు మరో టాక్‌ ఏంటంటే..  మాజీ భారత కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ ‘83’ చిత్రంలో అల్లు అర్జున్‌ నటించనున్నారట.

కపిల్‌దేవ్‌ సారథ్యంలో 1983లో భారత్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచ కప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘83’లో కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ చేస్తున్నారు. ప్రపంచ కప్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రకు చిత్రవర్గాలు అల్లు అర్జున్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే బాలీవుడ్‌లో ఆయన చేసే మొదటి చిత్రం ఇదే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement