రాజమౌళిపై కన్నడిగుల ఆగ్రహం!

Kannadigas Angry with Rajamouli Over Invitation Reject - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : అగ్రదర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బెంగళూర్‌లో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి హాజరుకావాల్సిందిగా కర్ణాటక చలన చిత్ర అకాడమీ రాజమౌళికి ఆహ్వానం పంపింది. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించటంపై వారు మండిపడుతున్నారు. 

‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చాలా మంది నటీనటులకు, మేకర్లకు ఆహ్వానం పంపాం. కానీ, చాలా వరకు హాజరుకాలేదు. దర్శకుడు రాజమౌళికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపాం. కానీ, రాలేనని నేరుగా చెప్పేశారు. ఇది కన్నడ ప్రజలను, ముఖ్యమంత్రి(సిద్ధరామయ్య)ని అవమానించటమే. వారంపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం కాస్తైనా సమయం కేటాయించాల్సింది’ అని కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్‌ ఎస్‌వీ రాజేంద్ర సింగ్‌ బాబు అభిప్రాయపడ్డారు. 

కాగా, బాహుబలి వివాద సమయంలో(సత్యరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు) తాను రాయ్‌చూర్‌ మూలాలు ఉన్నవాడినంటూ సినిమా విడుదలను అడ్డుకోవద్దని రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.  ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన కార్యక్రమానికి రావటానికి ఆయనకొచ్చిన సమస్యేంటని? కన్నడిగులు సోషల్‌ మీడియాలో ఫైర్‌ అవుతున్నారు. అయితే ముందుగా ఫిక్స్‌ చేసుకున్న కార్యక్రమాల వల్లనే తాను రాలేకపోతున్నానని రాజమౌళి వారితో చెప్పినట్లు తెలుస్తోంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top