నందితతో ‘శ్రీనివాస కళ్యాణం’ | Kannada Actress Nandita Swetha in Nithins Next | Sakshi
Sakshi News home page

Feb 7 2018 10:53 AM | Updated on Feb 7 2018 11:49 AM

Nithin Nandita Swetha - Sakshi

నితిన్‌, నందిత శ్వేత

ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న యంగ్ హీరో నితిన్, ఆ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో నితిన్‌కు హీరోయిన్‌ను ఫైనల్‌ చేశారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటి నందిత శ్వేత. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ అందాల భామ శ్రీనివాస్‌ కళ్యాణంలో నితిన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నందిత ఎంపికపై టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వార్తలు వినిపిస్తున్న చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement