
నితిన్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘తమ్ముడు’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ అయింది. అయితే, సినిమా కథలో పెద్దగా బలం లేకపోవడంతో డిజాస్టర్గా మిగిలిపోయింది. తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటించారు.

'తమ్ముడు' సినిమా నెట్ఫ్లిక్స్(Netflix) ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆ సంస్థ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఆగష్టు 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు షోషల్మీడియాలో పేర్కొంది. నితిన్-దిల్ రాజు కాంబినేషన్‌లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తమ్ముడు సినిమా రావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను ఎదుర్కొంది.
కథ ఏంటంటే..
జై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు.
అక్కడ బిజినెస్‌మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.
Thana lakshyanni, akkani thirigi thevadaniki ee thammudu is on a mission!
Watch Thammudu on Netflix, out 1 August in Telugu, Tamil, Malayalam and Kannada.#ThammuduOnNetflix pic.twitter.com/5mAUQ9GXwY— Netflix India South (@Netflix_INSouth) July 27, 2025