వాళ్ల కంటే ఆమెకే ఎక్కువ! | Kangana Ranaut Paid 10 crores, More than Saif | Sakshi
Sakshi News home page

వాళ్ల కంటే ఆమెకే ఎక్కువ!

Dec 5 2015 11:51 PM | Updated on Sep 3 2017 1:33 PM

వాళ్ల కంటే ఆమెకే ఎక్కువ!

వాళ్ల కంటే ఆమెకే ఎక్కువ!

హీరోల కన్నా మేమేం తీసిపోయాం? చెప్పాలంటే వాళ్లకన్నా మాకే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి.

‘‘హీరోల కన్నా మేమేం తీసిపోయాం? చెప్పాలంటే వాళ్లకన్నా మాకే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. లేదంటే ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి’’ అని హాలీవుడ్‌లో జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సెన్‌ల నుంచి బాలీవుడ్‌లో దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వరకూ అందరూ ముక్త కంఠంతో చాలా కాలంగా  అంటున్న మాట ఇది. హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సెన్‌లు తమ మాట నెగ్గించుకుని ఇప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పుడు  బాలీవుడ్‌లో కంగనా రనౌత్ వంతు  వచ్చింది.
 
  హిందీ రంగంలో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్న కంగనా రనౌత్ తాజా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగూన్’.  విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం కంగనా ఏకంగా రూ.10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఇందులో విశేషమేమిటంటే సైఫ్, షాహిద్‌లకు ఒక్కొక్కొరికి రూ.5 కోట్ల  మాత్రమే దక్కాయట. కంగనా రనౌత్ ఒక్కరికే రూ. 10 కోట్లు పారితోషికం ముట్టజెప్పడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement