మెగాఫోన్ పడుతున్న హీరోయిన్! | Kangana Ranaut all set to direct a comedy film | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!

May 5 2017 9:55 AM | Updated on Sep 5 2017 10:28 AM

మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!

మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!

రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్‌లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది.

రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్‌లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్, క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న కంగనా.. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్... కట్ అని చెబుతానంటోంది. క్రిష్ దర్శకత్వంలో తాను చేస్తున్న 'మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా తర్వాత ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని, అది కామెడీ అవుతుందని కంగనా ఖరారు చేసింది. మణికర్ణిక పోస్టర్ విడుదల అనంతరం ఆమె వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది.

రాణీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించే అవకాశం వచ్చిన తర్వాత.. తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని, అందుకే ఇప్పుడు తనకు ఎంతో ప్యాషన్ అయిన దర్శకత్వం వైపు వెళ్తున్నానని 30 ఏళ్ల కంగన తెలిపింది. తాను 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశానని, ఏదైనా సాధించినట్లు ఎప్పటికి ఫీలవుతానో అప్పటికి ఏమీ తెలియదని, ఇన్నాళ్లకు తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని చెప్పింది. విజయాలు, పరాజయాలు అన్నీ చూసి తాను అన్నీ సాధించేశానని అనుకోడానికి ముందే దర్శకత్వం వైపు కూడా వెళ్తున్నట్లు వివరించింది. ఇక నటనతో సమయం ఎక్కువగా వేస్ట్ చేసుకోనని, అయితే దర్శకత్వం వహిస్తూనే తన సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. అందుకే క్రిష్‌తో 'నా చిట్టచివరి డైరెక్టర్ మీరే' అని చెప్పేశానంది. తనకు నటిగా కంటే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టమంది.

Advertisement
 
Advertisement
Advertisement