పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్ | Kamaal r Khan tweets on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్

Mar 17 2016 12:16 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్ - Sakshi

పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్

వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్, టాలీవుడ్ పవర్ స్టార్ మీద నోరు పారేసుకున్నాడు.

వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్, టాలీవుడ్ పవర్ స్టార్ మీద నోరు పారేసుకున్నాడు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ ఫాలోయింగ్ ఉన్న పవన్ను విమర్శించి ఇక్కడకూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ పవర్ స్టార్పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు కమాల్.

'పవన్ కళ్యాణ్ లాంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావొచ్చు. అసలు దక్షిణాది ప్రేక్షకులకు ఏమైంది? ఇలాంటి కార్టూన్ని వాళ్లు హీరోగా ఎలా అంగీకరిస్తున్నారు..? వాళ్ల ఛాయిస్ అస్సలు బాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి జోకర్, కార్టూన్ హీరో సినిమాలు చూసే కన్నా, నేను రాజ్ పాల్ యాదవ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను' అంటూ కమాల్ ట్వీట్ చేశాడు. అయితే, పవన్ మీద వ్యాఖ్యలు చేసిన అతడికి.. పవన్ పూర్తిపేరు కూడా సరిగా తెలియదు. 'పవన్ కళ్యాణ్ సింగ్' అని పవన్ పేరును ప్రస్తావించాడు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పవన్ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా ఇప్పుడు అదే లిస్ట్లో కమాల్ రషీద్ ఖాన్ కూడా చేరిపోయాడు. కమాల్ ట్వీట్లపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కమాల్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రఛారం లభిస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement