తారక్‌... నీ నమ్మకం నిజమైంది

kalyan ram 118 movie press meet - Sakshi

– కల్యాణ్‌రామ్‌

కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘118’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మించారు. ప్రముఖ కెమెరామెన్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఫస్ట్‌ షోకే మంచి టాక్‌ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికి థ్యాంక్స్‌. గుహన్‌గారు నాలో ఏం చూశారో నాకు ఇప్పటికీ తెలియదు.

ఈ రోజు మా నిర్మాత మహేశ్‌ నవ్వు చూస్తున్నాను. ‘నా నువ్వే’ సినిమా రిలీజైనప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకింకా గుర్తే. అప్పుడు నేను ‘మనం కొత్తగా చేయాలని ట్రై చేస్తాం, కొన్ని వర్కవుట్‌ అవ్వవు. నో ప్రాబ్లమ్, మన ‘118’ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తనతో చెప్పాను. అదే నిజం అయ్యింది. మన నిర్మాత నవ్వుతూ ఉండటం కంటే ఓ హీరోకి ఏం కావాలి. మా ఎడిటర్‌ తమ్మిరాజు ఈ సినిమాను న మ్మి మా కంటే ఎక్కువ వర్క్‌ చేసారు. శేఖర్‌ చంద్ర ఉన్నది ఒకటే పాట కదా అని అనుకోకుండా ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్‌ను అందించారు.

యన్టీఆర్‌ని ఉద్దేశించి... నాన్నా.. తారక్‌ నీ నమ్మకం నిజమైంది. ఫస్ట్‌ నువ్వే ఈ సినిమాని చూశావు. ఖచ్చితంగా హిట్‌ అవుతుంది’ అని చెప్పావు. మా కథ మీద నమ్మకంతో సినిమా కొన్న ‘దిల్‌’ రాజు, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్‌’’ అన్నారు. మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు తాను నమ్మినది తీశారు. ఈ రోజు సినిమాకు ఇంత మంచి పేరు రావటానికి కారణం అదే. కలెక్షన్‌లు బావున్నాయి’’ అన్నారు. గుహన్‌ మాట్లాడుతూ– ‘‘నేను కెమెరా ముందుకు రావటానికి ఇష్టపడను. ఈరోజు గర్వంగా కెమెరా ముందు మాట్లాడుతున్నాను.

నేను తమిళ్‌ అయినా తెలుగు పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా ఆదరించింది.  కల్యాణ్‌రామ్‌ ఈ కథ విని ఎలా ఓకే చేశారు? అని నాకు ఓ కాల్‌ వచ్చింది. దానికి ఓ కొత్త విషయం చెప్పటానికి చాలా టాలెంట్‌ కావాలి. అది కల్యాణ్‌ గారిలో ఉంది అన్నాను’’ అని చెప్పారు. ‘‘క్రిటిక్స్‌ చాలామంది రాశారు ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా తీయాలంటే చాలా గట్స్‌ కావాలని’’ అన్నారు నివేదా. సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, మాటల రచయిత  ‘మిర్చి’ కిరణ్, ఎడిటర్‌ తమ్మిరాజు, విలన్‌ పాత్రధారి హబీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top