బోలెడన్ని గెటప్పులు

Kajal In John Abraham Mumbai Saga Movie - Sakshi

ముంబై అండర్‌వరల్డ్, అక్కడి గ్యాంగ్‌స్టర్‌ కథలు ఎప్పటికీ బోర్‌ కొట్టవు. ఇప్పుడు మరో ముంబై గ్యాంగ్‌స్టర్‌ సినిమా సిద్ధం అవుతోంది. ‘ముంబై సాగా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహాం హీరో. కాజల్‌ కథానాయికగా నటిస్తున్నారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌ శెట్టి, జాకీ ష్రాఫ్, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఇందులో జాన్‌ అబ్రహాంకు జోడీగా కాజల్‌ కనిపిస్తారు. కాజల్‌ పాత్ర వివిధ వయసుల్లో ఉంటుందట. అందుకోసం రకరకాల గెటప్స్‌లో కాజల్‌ కనిపిస్తారని తెలిసింది. టీ సిరీస్, వైట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top