రూట్‌ మార్చారా?

Kajal Aggarwal To Pair Up With Sree Vishnu For A New Movie - Sakshi

సౌత్‌ ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్‌ హీరోలందరితో నటించారు కాజల్‌ అగర్వాల్‌. ఇప్పుడు యంగ్‌ హీరోలతోనూ ఆమె సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కాజల్‌ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారట. శ్రీవిష్ణుతో కాజల్‌ నటించడం ఇదే తొలిసారి. మరి.. ఇలానే యంగ్‌ హీరోలతోనూ వరుసగా కాజల్‌ జోడీ కట్టాలనుకుంటున్నారా? వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top