డాక్టర్‌ కాజల్‌ | Kajal Aggarwal is playing the role of Dr. in Merzal movie | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కాజల్‌

Aug 30 2017 12:28 AM | Updated on Sep 17 2017 6:06 PM

డాక్టర్‌ కాజల్‌

డాక్టర్‌ కాజల్‌

యస్‌... ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ డాక్టర్‌ అయ్యారు.

యస్‌... ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ డాక్టర్‌ అయ్యారు. ఇది గౌరవ డాక్టరేట్‌ కాదు. ఎంబీబీఎస్‌ చదివితే డాక్టర్‌ అంటారే... ఆ డాక్టరే. కానీ, కాజల్‌ ఎంబీబీఎస్‌ చదవలేదు. మరెలా డాక్టర్‌ అవుతున్నారు? అంటే... హీరోయిన్‌గా చేస్తున్నారు కదా! ఆ కోటాలో డాక్టర్‌ అయ్యారు. అదెలా? అంటే... తమిళ హీరో విజయ్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘మెర్సల్‌’.

ఇందులో కాజల్‌ ఓ హీరోయిన్‌గా డాక్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి, వివేకం’... ఇటీవల చేసిన ఈ రెండు సిన్మాల్లోనూ ట్రెడిషనల్‌గా కనిపించారు కాజల్‌. ఇందులో మోడ్రన్‌గా కనిపిస్తారట! కాజల్‌తో పాటు సమంత, నిత్యా మీనన్‌ కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిపై కాజల్‌ స్పందిస్తూ... ‘‘గతంలోనూ నేను మల్టీ హీరోయిన్‌ ఫిల్మ్స్‌ చేశా. ఇప్పుడు కొత్తేం కాదు కదా! నా పాత్రకు సిన్మాలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement