ముచ్చటగా మూడోసారి! | Kajal Agarwal with NTR for third time | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి!

Jun 3 2014 10:51 PM | Updated on Mar 22 2019 1:53 PM

ముచ్చటగా మూడోసారి! - Sakshi

ముచ్చటగా మూడోసారి!

కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమకు దూరమవుతోందనీ, బాలీవుడ్, కోలీవుడ్‌లపైనే అధిక శ్రద్ధ అనీ ఈ మధ్య మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిదేమీ లేదనీ, మంచి అవకాశం

 కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమకు దూరమవుతోందనీ, బాలీవుడ్, కోలీవుడ్‌లపైనే అధిక శ్రద్ధ అనీ ఈ మధ్య మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిదేమీ లేదనీ, మంచి అవకాశం వస్తే, ఏ మాత్రం వదిలిపెట్టననీ కాజల్ కౌంటర్ కూడా ఇచ్చారు. తెలుగులో ఆమె ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. రామ్‌చరణ్ సరసన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో భారీ ఆఫర్‌ను చేజిక్కించుకున్నారట. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమె నాయికగా ఎంపికయ్యారట. ఎన్టీఆర్‌తో కాజల్ ఇంతకు ముందు ‘బృందావనం’, ‘బాద్‌షా’ చిత్రాల్లో నటించారు. పూరి దర్శకత్వంలో ‘బిజినెస్‌మేన్’లో చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌తో ముచ్చటగా మూడోసారి నటి స్తున్నానని కాజల్ ఆనందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement