పెళ్లా.. ఇప్పుడా!

Kajal Agarwal Clarity on Her Marriag - Sakshi

ఇదిగో అమ్మాయ్‌! పెళ్లెప్పుడు? ఇప్పుడు నీ వయసెంతో తెలుస్తుందా?... పెళ్లీడు దాటిన ప్రతి అమ్మాయికి ఏదొక టైమ్‌లో ఇంచు మించు ఇటువంటి ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. చుట్టాలో... చుట్టుపక్కల వాళ్లో... ఎవరొకరు అడుగుతారు. వాళ్లందరికీ ఏదొకటి చెప్పి తప్పించుకోవచ్చు లేదా ‘నీకెందుకు?’ అని ఎదురు తిరగొచ్చు. అదే ఇంట్లోవాళ్లు అడిగితే? సమాధానం చెప్పడం కొంచెం కష్టమే కదూ! సరిగ్గా ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారు కాజల్‌ అగర్వాల్‌. వచ్చే నెలాఖరుకు కాజల్‌ సిస్టర్‌ నిషాకు పెళ్లై నాలుగేళ్లు! నిషా పెళ్లి టైమ్‌లో అడిగిన వాళ్లకు ‘చెల్లికి నచ్చిన అబ్బాయి దొరికాడు. పెళ్లి చేసుకుంది.

నా పెళ్లికి ఇంకా బోల్డంత టైముంది’ అని కాజల్‌ క్లారిటీ ఇచ్చారు. అయితే... ఇప్పుడామె తల్లిదండ్రులే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారట! కాజల్‌ అంత త్వరగా ఒప్పుకోలేదులెండి! ‘‘ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. నేను మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నా. అందుకే, నా దగ్గరకు వచ్చిన కథల్లోంచి నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటున్నా. కొన్నేళ్లు సినిమాల్లో కొనసాగుతా’’ అని తల్లిదండ్రులకు చెప్పేశానని కాజల్‌ తెలిపారు. ఇప్పుడు కాజల్‌కి 32 ఏళ్లు. కానీ, అంత వయసున్నట్టు కనిపిస్తుందా? సో... ఈజీగా ఇంకో ఐదారేళ్లు సినిమాలు చేస్తారేమో!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top