మహానుభావుడి పాత్రలో మహానటుడు

Kaikala Satyanarayana in H. M Reddy - Sakshi

ఏ పాత్రకైనా జీవం పోయగల నటులు కైకాల సత్యనారాయణ. అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారాయన. ఇప్పుడు తెలుగు సినిమా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెమ్‌. ఎమ్‌. రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘యన్టీఆర్‌’. ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పణలో క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సినిమాలో హెచ్‌.ఎమ్‌. రెడ్డి పాత్రలో నటిస్తున్నారు కైకాల సత్యనారాయణ. బుధవారం కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘంగా చేస్తున్నారు’’ అన్నారు క్రిష్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top