దూసుకుపోతున్న కబాలి 'నిరుప్పుడా' | Kabali Neruppu Da Song teaser release | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న కబాలి 'నిరుప్పుడా'

Jun 17 2016 10:01 AM | Updated on Sep 4 2017 2:44 AM

దూసుకుపోతున్న కబాలి 'నిరుప్పుడా'

దూసుకుపోతున్న కబాలి 'నిరుప్పుడా'

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే దుమ్ము రేపుతోంది.

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే దుమ్ము రేపుతోంది.   ఆ సినిమాలోని ఓ సాంగ్ టీజర్ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళంలో 'నిరుప్పుడా' పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం ఆడియో ఎలాంటి అట్టహాసం లేకుండా విడుదల చేశారు. గతంలోనూ ఈ చిత్రం టీజర్‌ అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది కూడా.

కబాలి చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. రజనీకాంత్, రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే తమిళంలో విడుదల కాగా త్వరలో తెలుగులో విడుదల కానున్నాయి. ఇక సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక టీజర్లో రజనీకాంత్ లుక్ సరికొత్తగా ఉంది. స్టైల్ అంటే రజనీ...రజనీ అంటేనే స్టైల్ అనేట్టుగా ఉంది. కాగా జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement