కేసీఆర్‌... కబ్‌ ఆయేగా ఆప్‌?

K Chandrashekar Rao's life on film: Madhura Sreedhar Reddy  - Sakshi

కమర్షియల్‌ సిన్మాకు కావలసిన ముడి సరుకులన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) జీవిత కథలో ఉన్నాయి. ఈ ముడి సరుకుల్ని మాంచి మిక్చర్‌ పొట్లంగా కట్టే నేర్పు కావాలంతే! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎపిసోడ్‌ అయితే సిల్వర్‌స్క్రీన్‌పై గూస్‌ బంప్స్‌ ఇవ్వడం గ్యారెంటీ. అందుకే, కేసీఆర్‌ జీవిత కథ తెలుగు దర్శక–నిర్మాతలను ఎట్రాక్ట్‌ చేసింది. అలా ఎట్రాక్ట్‌ అయినవాళ్లలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి ఒకరు. కథపై కొన్ని రోజులు కసరత్తులు కూడా చేశారు.

కేసీఆర్‌గా హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ బాగుంటాడని అతడితో చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌! ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి కాకుండా... తెలంగాణ సాయుధ పోరాటంపై ‘బందూక్‌’ సినిమా తీసిన దర్శకుడు లక్ష్మణ్‌ కేసీఆర్‌ బయోపిక్‌ మొదలుపెట్టారు. ‘‘అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడిన కేసీఆర్‌ జీవిత ప్రస్థానమే ‘గులాల్‌’ చిత్రకథ’’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఇవే కాకుండా... మరికొన్ని బయోపిక్స్‌ కూడా తెలుగులో రెడీ అవుతున్నాయట!!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top