జూలీ–2లో రాయ్‌లక్ష్మీ విజృంభణ | Julie-2 movie trailer was released Monday. | Sakshi
Sakshi News home page

జూలీ–2లో రాయ్‌లక్ష్మీ విజృంభణ

Sep 5 2017 1:53 AM | Updated on Sep 17 2017 6:23 PM

జూలీ–2లో రాయ్‌లక్ష్మీ విజృంభణ

జూలీ–2లో రాయ్‌లక్ష్మీ విజృంభణ

బాలీవుడ్‌ చిత్రం జాలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ విజృంభణను చూడవచ్చు.

తమిళసినిమా: బాలీవుడ్‌ చిత్రం జాలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ విజృంభణను చూడవచ్చు. ఏ విషయంలో విజృంభణ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్‌ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న నటి రాయ్‌లక్ష్మీ. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఏ భాషలోనూ హీరోయిన్‌గా సరైన స్థాయికి చేరుకోలేకపోయింది.

దీంతో ఐటమ్‌ సాంగ్స్‌ చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆ మధ్య తెలగు చిత్రం ఖైదీ నంబర్‌వన్‌ చిత్రంలో బాసూ చూపించు నీ గ్రేస్‌ అంటూ ఐటమ్‌ సాంగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని తన విచ్చల విడి అందాలతో రెచ్చగొట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టిన రాయ్‌లక్ష్మీకి బాలీవుడ్‌లో అవకాశాలు రాబట్టాలన్నది చిరకాల వాంఛ. దీంతో ఆ మధ్య అక్కడే మకాం పెట్టి ఎట్టకేలకు జూలీ–2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

కాగా ఆ చిత్ర ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. అందులో రాయ్‌లక్ష్మీ హాట్‌ దృశ్యాలను చూసి సినీ వర్గాలే విస్తు పోతున్నారు. గ్లామర్‌ అనే పదానికే అర్థాన్ని రాయ్‌లక్ష్మీ మార్చేసిందనే కామెంట్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈత దుస్తులు మొదలుకొని ఎన్ని రకాలుగా శృంగారంగా కనిపించాలో అన్ని విధాలుగా జూలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ విజృంభించి నటించింది. మొత్తం మీద ఈ చిత్రం సెన్సార్‌ సభ్యులకు చేతినిండా పని చెప్పేలా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement