ఎన్టీఆర్ లేటెస్ట్‌ మూవీ ఫొటోలు మళ్లీ లీక్‌!

Jr NTRs Aravinda Sametha Movie Stills Again Leaked - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. అయితే వరుస లీకులతో ఈ మూవీ యూనిట్‌ ఆందోళనకు చెందుతోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న మూవీ స్టిల్‌ ఒకటి ఇటీవల లీక్‌ కాగా, తాజాగా అదే సీన్‌కు సంబంధించి మరిన్ని స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు అంచనాలు పెరుగుతున్న మూవీకి లీకుల బెడద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకులు ఎవరు చేస్తున్నారన్న దానిపై మూవీ యూనిట్‌ దృష్టిసారించినట్లు సమాచారం.

ఇటీవల లీకైన ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. తాజాగా లీకైన ఫొటోల్లో ఆ సీన్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు ఉన్నాయి. జూన్‌ 21న షూటింగ్‌ జరిగినట్లు ఫొటోలపై మనం గమనించవచ్చు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయనిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అక్టోబర్‌ 10న మూవీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top