తారక్‌ ట్వీట్‌పై నందమూరి అభిమానుల్లో చర్చ

Jr Ntr Appreciated Nani Jersey But Didn Not Reponded On NTR Biopic - Sakshi

ఈ జనరేషన్‌ హీరోలు ఇగోలను పక్కన పెట్టి ఇతర హీరోల సినిమాల విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అంతేకాదు అవసరమైతే తమ వంతు సాయంగా సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా భాగం పంచుకుంటున్నారు. తాజాగా నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశాడు. రిలీజ్ రోజే సినిమా చూసిన తారక్‌, చిత్రయూనిట్‌లో ఒక్కొక్కరిని పేరు పేరునా అభినందించాడు.
(చదవండి : జెర్సీ టీంపై జూ. ఎన్టీఆర్‌ ట్వీట్‌)

అయితే ఇప్పుడే ఇదే నందమూరి అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య సూపర్‌ అంటూ పొగిడాడు. కానీ తారక్‌ మాత్రం సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.
(చదవండి : మహానాయకుడి మాటే ఎత్తని ఎన్టీఆర్‌)

కథానాయకుడు ప్రీ రిలీజ్‌కు హాజరైన తారక్‌ తరువాత ఆ సినిమా గురించి ఎక్కడ స్పందించలేదు. రిలీజ్ తరువాత ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో బాలకృష్ణ, ఎన్టీఆర్‌ మధ్య ఇంకా దూరం అలాగే ఉందన్న వాదన వినిపిస్తోంది. హరికృష్ణ మరణం తరువాత అంతా ఒక్కటయ్యారన్న సందేశం అభిమానుల్లోకి పంపేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయినా ఎన్టీఆర్ బయోపిక్‌ విషయంలో తారక్‌ స్పందించిన తీరును బట్టి ఇంకా అన్ని సర్దుకోలేదని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top