నానీని చూస్తే గర్వంగా ఉంది : జూ. ఎన్టీఆర్‌

Jr Ntr Praises Nani And Jersey Movie Team - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా.. ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించిన నానీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించి సహజ నటనతో పూర్తిగా ఫాంలోకి వచ్చేశాడంటూ పలువురు నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని మార్క్‌ నేచురల్‌ పర్ఫామెన్స్‌, పిరియాడిక్‌ నేటివిటీ, ఎమోషనల్‌ సీన్స్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లాడంటూ జెర్సీ దర్శకుడిని కూడా అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీక్షించిన అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ట్విటర్‌ వేదికగా నానితో పాటు జెర్సీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ‘ ఇదో అద్భుతమైన సినిమా. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసిన అనుభూతిని కలిగించింది. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని.. దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు’ అని ట్వీట్‌ చేశాడు. ఇక జెర్సీ మూవీలో నాని నటనకు ముగ్ధుడైన జూ. ఎన్టీఆర్‌... ‘ అద్భుతమైన ప్రదర్శనతో బాల్‌ను పార్క్‌ అవతలకు బాదావు. బ్రిలియంట్‌!!! చాలా రోజుల తర్వాత నీ నుంచి వచ్చిన ఇలాంటి ప్రదర్శన చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా’ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

చదవండి : ‘జెర్సీ’ మూవీ రివ్యూ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top