ఎన్టీఆర్, రాజమౌళి, విజయ్ దేవరకొండ..! | Jr NTR and Vijay devarakonda with SS Rajamouli for Short film | Sakshi
Sakshi News home page

Jan 11 2018 11:59 AM | Updated on Jul 14 2019 4:05 PM

Jr NTR and Vijay devarakonda with SS Rajamouli for Short film - Sakshi

హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు, సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ లఘు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండలు కనిపించనున్నారు. రాజమౌళి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ ఈ హీరో క్యాంపెయిన్ లో చేరటం వల్ల మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐదు లఘ చిత్రాలను రూపొందించారు. వీటితో సామాజిక మాధ్యమాల నేపథ్యంలో జరుగుతున్న మోసాలు, ఉద్యోగావకాశాల విషయంలో జరిగే మోసాలు, ఓటీపీ సంబందిత మోసాలు, పెళ్లి ప్రకటనలతో జరిగే మోసాలులతో పాటు మార్కెంటిగ్ బిజినెస్ పేరుతో జరిగే మోసాల విషయంలో ప‍్రజలను చైతన్యవంతం చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement