కన్నయ్య తపన | jogu ramanna released kannayya movie songs | Sakshi
Sakshi News home page

కన్నయ్య తపన

Feb 6 2017 11:31 PM | Updated on Sep 5 2017 3:03 AM

కన్నయ్య తపన

కన్నయ్య తపన

‘ఎంత కష్టమైనా తాను అనుకున్నది సాధించాలన్నది ఆ యువకుడి తపన.

‘ఎంత కష్టమైనా తాను అనుకున్నది సాధించాలన్నది ఆ యువకుడి తపన. తన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు?’అనే అంశంతో తెరకెక్కిన చిత్రం ‘కన్నయ్య’. విపుల్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రాన్ని రాజేష్‌ జాదవ్, కృష్ణంరాజు పగడాల, రవితేజ తిరువాయిపాటి నిర్మిస్తున్నారు. హర్షిత కథానాయిక. సత్యకశ్యప్, ఘంటసాల విశ్వనాధ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు.

సినిమా ట్రైలర్‌ను కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌. వేణుగోపాలచారి రిలీజ్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో తెరకెక్కుతోన్న చిత్రమిది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. చిత్ర నిర్మాతలు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, మల్కాపురం శివకుమార్, డి.ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement