ఎట్టకేలకు.. తెలుగులో!
ఎవరు చేస్తారీ రీమేక్‌లో - బాలకృష్ణ - కల్యాణ్‌రామా? చిరంజీవి - రామ్‌చరణా? ఇటీవలి కాలంలో అలా రోజుకో
ఎవరు చేస్తారీ రీమేక్‌లో - బాలకృష్ణ - కల్యాణ్‌రామా? చిరంజీవి - రామ్‌చరణా? ఇటీవలి కాలంలో అలా రోజుకో వార్తతో సంచలనం రేపిన తమిళ సినిమా ‘జిల్లా’. తమిళ స్టార్ విజయ్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కలసి నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు అనువాద రూపంలోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. హీరో జీవా అతిథి పాత్ర చేశారు.
ఆర్.టి. నీసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో తమటం కుమార్ రెడ్డి ప్రసాద్ సన్నిధి తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘‘ఎంతో పోటీ ఉన్నా, ఈ సినిమా హక్కులను మాకు ఇచ్చిన ఆర్.బి. చౌదరిగారికి మా కృతజ్ఞతలు. తెలుగు వెర్షన్ కోసం బ్రహ్మానందం, ఎల్.బి. శ్రీరాం, సురేఖావాణిలపై ప్రత్యేకంగా సన్నివేశాలను చిత్రీకరించాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహ నిర్మాత: నామన శంకర్‌రావు, దర్శకత్వం -


