చింపాంజీ.. వెరీ చిలిపి | Jiiva and Shalini Pandey's Gorilla first look to release | Sakshi
Sakshi News home page

చింపాంజీ.. వెరీ చిలిపి

Jun 23 2018 12:14 AM | Updated on Jun 23 2018 12:14 AM

Jiiva and Shalini Pandey's Gorilla first look to release - Sakshi

జీవా, షాలినీ పాండే

స్టూడెంట్‌ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్‌.. ఇలా డిఫరెంట్‌ గ్యాంగ్‌ల గురించి వింటాం. సినిమాల్లో చూస్తాం. మరి.. గొరిల్లా గ్యాంగ్‌ పవర్‌ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘గొరిల్లా’ సినిమా చూడాల్సిందే. కొత్త దర్శకుడు డాన్‌ శాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవా, షాలినీ పాండే, యోగిబాబు, రాధా రవి, సతీష్, వివేక్‌ ప్రశన్న, రాజేంద్రన్‌ ఈ గొరిల్లా గ్యాంగ్‌ సభ్యులు. ‘గొరిల్లా’ ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘విక్రమ్‌వేదా’ ఫేమ్‌ శ్యామ్‌ సీఎస్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘‘చింపాజీలు చాలా తెలివైనవి. అవి చేసే చిలిపి చేష్టలకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ సినిమాలో చింపాంజీ ఓ మేజర్‌ క్యారెక్టర్‌ చేసింది. యాక్షన్‌ అండ్‌ కామెడీ సీన్స్‌ తీయడానికి చింపాజీకి నాలుగు నెలలు ముందే ట్రైనింగ్‌ ఇప్పించాం. సినిమా విడుదల తర్వాత మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్‌ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement