జేడీ బాబు! | Sakshi
Sakshi News home page

జేడీ బాబు!

Published Tue, Oct 24 2017 12:43 AM

JD Chakravarthy to produce Ram Gopal Varma's Lakshmi\'s NTR

జేడీ చక్రవర్తి కదా... జేడీ బాబు అంటున్నారేంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. త్వరలో జేడీ ఓ రాజకీయ నాయకుడి పాత్ర చేయనున్నారట. అందుకే ‘జేడీ బాబు’ అనాల్సి వచ్చింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో ఊహించే ఉంటారు. యస్‌... చంద్రబాబు నాయుడు. నటుడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీయనున్న విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఎన్టీఆర్‌ పాత్రకి ఎవరు సరిపోతారు? లక్ష్మీ పార్వతిగా నటించేది ఎవరు? చంద్రబాబునాయుడు పాత్ర ఎవరు చేస్తారు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఇండస్ట్రీకి పరిచయం లేని కొత్తవారు కనిపిస్తారని వర్మ ప్రకటించి, క్లారిటీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

బాబు పాత్రలో వర్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. జేడీ మంచి నటుడు. పైగా గడ్డం కూడా మెయిన్‌టైన్‌ చేస్తారు. అందుకే చంద్రబాబు పాత్రకే అతనే కరెక్ట్‌ అన్నది వర్మ ఆలోచనట. గురువు అడిగితే శిష్యుడు కాదంటారా? ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో ‘ఉగ్రం’ అనే చిత్రంలో నటిస్తున్నారు జేడీ.

Advertisement
Advertisement