అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం | Jayam Ravi Tik Tik Tik Movie trailer | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం

Aug 15 2017 3:38 PM | Updated on Sep 17 2017 5:33 PM

అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం

అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం

జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్‌ టిక్‌ టిక్‌ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్‌ టిక్‌ టిక్‌ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 1981లో ఇదే పేరుతో  కమలహాసన్‌ నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్‌ టిక్‌ టిక్‌లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్‌  నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో జయంరవి కొడుకు మాస్టర్‌ ఆరవ్‌ వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

నెమిచంద్‌ జబక్‌ పతాకంపై వీ.హింటేశ్‌జబక్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకుడు. గతంలో జయం రవి హీరోగా సౌందర్‌రాజన్‌ మిరుదన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు.  జోంబీస్‌ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి భారతీయ చిత్రంగా నమోదు కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement