‘ఐరన్‌ లేడి’గా వస్తున్న అమ్మ

Jayalalithaa Biopic Is The Iron Lady. AR Murugadoss Reveals First Poster - Sakshi

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత... అటు వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జయలలిత జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడానికి సుమారు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్‌ చేయబోయే అమ్మ బయోపిక్‌ టైటిల్‌ పేరును, ఫస్ట్‌ లుక్‌ను డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్ ఆవిష్కరించారు.

‘జయలలిత బయోపిక్‌ ‘ది ఐరన్‌ లేడి’ టైటిల్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ సాధించాలని ఆశిస్తున్నా’ అంటూ ఏఆర్‌ మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్‌గా జరగనుందని కూడా ప్రకటించారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం ‘ది ఐరన్‌ లేడి’ గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు. తమిళ్‌, తెలుగు, కన్నడ, హిందీ భాషల ప్రజలకు చేరేలా ఈ సినిమాను తీయాలని ప్లాన్‌ చేశామని చెప్పారు. ఈ సినిమా అమ్మకు నివాళిగా సమర్పించనున్నామన్నారు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా, జయలలిత సినిమా తీద్దామనుకున్న మరో లెజెండ్‌ డైరెక్టర్‌ దాసరి నారాయణ రావు. అమ్మ బయోపిక్‌ తీయాలని కోరిక నెరవేరకుండా దాసరి నారాయణ రావు కన్నుమూశారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top