తెలుగు రాష్ట్రంలో తలైవి

jayalalitha biopic movie is jaya shooting at hyderabad - Sakshi

ప్రముఖనటి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు). ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ క్వీ¯Œ కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవల మైసూర్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌ భాగ్యనగరంలో(హైదరాబాద్‌) ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌లు రెడీ చేశారు. ఇక్కడి షెడ్యూల్‌ దాదాపు 25 రోజులు సాగుతుందని సమాచారం. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top