నా నవ్వులో నువ్వున్నావమ్మా : జాన్వీ | Janhvi Kapoor Shares a Heartfelt Post Prior to Sridevi Death Anniversary | Sakshi
Sakshi News home page

నా నవ్వులో నువ్వున్నావమ్మా : జాన్వీ

Feb 24 2019 12:23 PM | Updated on Feb 24 2019 12:23 PM

Janhvi Kapoor Shares a Heartfelt Post Prior to Sridevi Death Anniversary - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి సంవత్సరం అవుతున్నా.. ఇప్పటికీ అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఇక వారి కుటుంబ సభ్యుల పరిస్థితీ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ముఖ్యంగా శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ ప్రతీ సందర్భంలోనూ తల్లి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా మరోసారి అమ్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జాన్వీ.

‘నా మనసు ఎప్పుడూ భారంగానే ఉంటుంది. అయినా నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ నువ్వులోనే నువ్వున్నావ్‌..’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు జాన్వీ. ఈ కామెంట్‌తో పాటు తన చేతిని శ్రీదేవి పట్టుకున్న ఫోటోను షేర్‌ చేశారు. కూతురిని వెండితెర మీద చూసుకునేందుకు ఎంతగానో తాపత్రేయ పడ్డ శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement