నన్నెవరో ఆవహించారు!

Janhvi Kapoor on Her Netflixs Ghost Stories Character - Sakshi

షూటింగ్‌ పూర్తి చేసినప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. కానీ, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ను పూర్తి చేసి ‘హమ్మయ్య’ అని రిలీఫ్‌ ఫీలవుతున్నారు జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌లో రూపొందిన హారర్‌ అంథాలజీ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జాన్వీకపూర్‌ విభాగానికి జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారని తెలిసింది. ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసిన జాన్వీ మాట్లాడుతూ –‘‘స్క్రిప్ట్‌ నన్ను బాగా ఆకట్టుకోవడంతో పాత్రలో బాగా లీనమయ్యాను.

కానీ, షూటింగ్‌ సమయంలో చాలా భయపడ్డాను. మనిషి భావోద్వేగాల్లో భయం కూడా ఒక ముఖ్యమైనదనిపిస్తోంది. నిజం చెప్పాలంటే షూటింగ్‌ పూర్తయ్యేలోపు మా బృందంలోని పదిమందిలో ఎనిమిది మంది అనారోగ్యం బారినపడ్డారు. షూట్‌ సమయంలో నన్ను ఎవరో ఆవహించినట్లు, షూట్‌ తర్వాత వదిలేసిన అనుభూతికి లోనయ్యాను. ఈ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ నన్ను చాలా భయపెట్టింది’’ అని జాన్వీ పేర్కొన్నారు.  ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అంథాలజీలో ఓ భాగంలో జాన్వీ, మిగతా భాగాల్లో శోభితా ధూళిపాళ్ల, మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. న్యూ ఇయర్‌కి ఈ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ వీక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top