పూరీతో జన గణ మన | Jana Gana Mana: Puri Announces Film With Mahesh | Sakshi
Sakshi News home page

పూరీతో జన గణ మన

Apr 28 2016 11:04 PM | Updated on Sep 3 2017 10:58 PM

పూరీతో జన గణ మన

పూరీతో జన గణ మన

మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే.

 మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ ఏప్రిల్ 28కి ‘పోకిరి’ విడుదలై పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు హీరోగా తాను చేయనున్న చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా పూరి గురువారం రాత్రి ప్రకటించారు. ‘‘‘పోకిరి’ విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మహేశ్‌తో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను. మహేశ్ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఈసారి ‘పోకిరి’కన్నా ఇంకా రూత్ లెస్‌గా, ‘బిజినెస్‌మేన్’కన్నా ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటాడు మహేశ్’’ అని పూరి తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అలాగే ‘జన గణ మన’ అనే టైటిల్‌తో, మన జాతీయ జెండా, మహేశ్ కళ్లతో ఓ డిజైన్‌ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement