మాస్‌ మహరాజ్‌ చేతుల మీదుగా

Jamba Lakidi Pamba Trailer Launched By Ravi Teja On June 11 ‏ - Sakshi

‘జంబ లకిడి పంబ’  సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరు. సీనియర్‌ నరేశ్‌ హీరోగా, ఆమని హీరోయిన్‌గా ఈవీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ కామెడీ సినిమా. ఇప్పుడు అదే సినిమా టైటిల్‌తో శ్రీనివాస్‌ రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా తెరకెక్కిస్తున్నారు. జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్, గోపీ సుందర్‌ అందించిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మాస్‌ మహారాజ్‌ రవితేజ చేతుల మీదుగా సోమవారం(జూన్‌11న) రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నాయి. జూన్‌ 22న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. పలువురు స్టార్స్‌ ప్రమోషన్‌ లో పాలుపంచుకోవటం  కూడా సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top