బాలీవుడ్లో రెండు భాగాలుగా విడుదలై మంచి విజయం సాధించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' సిరీస్ లో ఇప్పుడు మూడో భాగాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్లో రెండు భాగాలుగా విడుదలై మంచి విజయం సాధించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' సిరీస్ లో ఇప్పుడు మూడో భాగాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మాఫీయా, గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు అనురాగ్ కశ్యప్ దర్శకుడు, జైషాన్ ఖాద్రీ కథా కథనాలు అందించారు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో భాగానికి మాత్రం అనురాగ్ దర్శకత్వం వహించటం లేదు. తొలి రెండు భాగాలకు కథా రచయితగా వ్యవహరించిన ఖాద్రి మూడో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.
'మిరుతియా గ్యాంగ్ స్టర్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఖాద్రి ఆ సినిమా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించాడు. 'మిరుతియా గ్యాంగ్స్టర్స్' ప్రివ్యూ చూసిన అనురాగ్ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' మూడో భాగానికి కథ రెడీ చేయాల్సిందిగా కోరారని, ఆ సినిమాకు తననే దర్శకత్వం కూడా వహించాల్సిందిగా సూచించారని తెలిపారు. ఇప్పటికే ఆ మూవీ కోసం లైన్ వినిపించానన్న ఖాద్రి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.