స్టెప్పుల సాహో

Jacqueline Fernandez to shoot a special song for Prabhas' Saaho - Sakshi

ఫారిన్‌ ప్రదేశాలలో అద్భుతమైన పాటలను అదిరిపోయే స్టెప్పులతో పూర్తి చేశారు ప్రభాస్‌. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల యూరప్‌లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరించారు. ఒక పాటను ఆస్ట్రియాలో, మరో పాటను కురేషియాలో చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది. కురేషియాలో చిత్రీకరించిన పాటలో సుమారు యాభైమంది కురేషియన్‌ మోడల్స్‌తో ప్రభాస్‌ కాలు కదిపారు. అలాగే ఓ పాటలో ప్రభాస్‌తో హిందీబ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ స్టెప్పులేశారని సమాచారం. ఈ సినిమాకు జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top