ఆ కాంబినేషన్‌ను కలిపింది నేనే | Ippadai Vellum Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఆ కాంబినేషన్‌ను కలిపింది నేనే

Nov 4 2017 5:20 AM | Updated on Nov 4 2017 5:20 AM

Ippadai Vellum Movie Press Meet  - Sakshi

తమిళసినిమా: ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్‌ కాంబినేషన్‌ను తొలుత కలిపింది తానేనని దర్శకుడు గౌరవ్‌ నారాయణన్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇప్పడై వెల్లుమ్‌. ఉదయనిధిస్టాలిన్, మంజిమామోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, డానియేల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీ.ఇమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ సంస్థ  నిర్మిస్తోంది.

చిత్ర యూనిట్‌ గురువారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు గౌరవ్‌ నారాయణన్‌ మాట్లాడుతూ ఈ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్, హాస్య నటుడు సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్‌ల కాంబినేషన్‌ను తొలిసారిగా కలిపింది తానేనని చెప్పారు. ఇప్పడై వెల్లుమ్‌ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది రోజులకే ఉదయనిధిస్టాలిన్‌ తన వద్దకు వచ్చి సార్‌ తాను రేపటి నుంచి వేరే షూటింగ్‌లో పాల్గొంటున్నాను అని చెప్పారన్నారు. తీరా చూస్తే సవరణన్‌ ఇరుక్కభయమేన్‌ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్, సూరి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్‌లు కలిసి పని చేశారన్నారు.

ఆ తరువాత మరి కొన్ని రోజులకు వేరే చిత్రం చేస్తున్నానని ఉదయనిధి స్టాలిన్‌ చెప్పారన్నారు. ఆ చిత్రమే పొదువాగ ఎన్‌ మనసు తంగం అని చెప్పారు. ఈ చిత్రంలోనూ అదే కాంబినేషన్‌ అన్నారు. ఆ తరువాత తమ చిత్రం చేస్తున్నా, ఉదయనిధి స్టాలిన్‌ ఆ రెండు చిత్రాల గురించే మాట్లాడడంతో తాను ఈ చిత్ర నిర్మాతకు నెల రోజులు గ్యాప్‌ ఇచ్చి షూటింగ్‌ చేస్తానని చెప్పానన్నారు. అప్పటికి ఉదయనిధి స్టాలిన్‌ ఆ చిత్రాల మూడ్‌లోంచి బయట పడతారని భావించానన్నారు. అలా ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement