ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..! | Intresting News About Sree Vishnu Brochevarevarura | Sakshi
Sakshi News home page

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

Jun 18 2019 12:35 PM | Updated on Jun 18 2019 12:35 PM

Intresting News About Sree Vishnu Brochevarevarura - Sakshi

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బ్రోచేవారెవరురా. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ సినిమాను పూర్తిగా ఒరిజినల్‌ లొకేషన్స్‌లోనే రూపొందించారట. కనీసం ఒక్క సెట్‌ కూడా వేయకుండా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలు తప్ప కమర్షియల్‌ జానర్‌లో రూపొందించే సినిమాలు ఇలా పూర్తి ఒరిజినల్‌ లోకేషన్‌లో తెరకెక్కించిటం అరుదైన విషయమే.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన బ్రోచేవారెవరురా సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నివేదా పేతురాజ్‌, సత్యదేవ్‌లు కీలకపాత్రల్లో నటించారు. శ్రీవిష్ణు హీరోగా మెంటల్‌ మదిలో లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement